మరికల్ : మరికల్ మండలంలోని పస్పుల గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయం ( Shivalayam) అభివృద్ధికి అప్పంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ( Srinivas Reddy ) శనివారం ఆలయ కమిటీ సభ్యులకు రూ. 21వేలను విరాళంగా ( Donations ) అందజేశారు.
ఈనెల 21 నుండి 23 వరకు శివాలయంలో శివలింగం, సుబ్రహ్మణ్యస్వామి, గణపతి, ధ్వజస్తంభ, నాభి శిలా, మైసమ్మ గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపనలతో పాటు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ విగ్రహ ప్రతిష్టాపనను మండలంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.