నిధులున్నా సాగని పనులు
మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల తెలుగు మీడియంలో 325 మంది, ఉర్దూ మీడియంలో 109 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కేసీఆర్ సర్కారులో మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునఃనిర్మాణం కోసం రూ. 1.60 కోట్లు మంజూరు చేసింది.
- ఊట్కూరు పాఠశాలకు రూ.1.60 కోట్లు మంజూరు
- కేసీఆర్ సర్కారులోనే నిధుల కేటాయింపు
- ఏడు నెలలైనా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
ఊటూర్, జూలై 10 : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల తెలుగు మీడియంలో 325 మంది, ఉర్దూ మీడియంలో 109 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కేసీఆర్ సర్కారులో మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునఃనిర్మాణం కోసం రూ. 1.60 కోట్లు మంజూరు చేసింది. నిజాం కాలంలో నిర్మించిన పురాతన గదులను తొలగించి కొత్తగా గదుల నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా పనులను ప్రారంభించింది లేదు. అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు ముందుకు సాగకపోగా విద్యార్థులు ఇరుకు గదులు, వరండాల్లో కూర్చుని విద్యాభ్యాసం చేస్తున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక అవస్థలు పడుతున్నారు. మలమూత్ర విసర్జన కోసం ఆరుబయట, పెద్ద చెరువు సమీపంలోకి వెళ్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

