మక్తల్ : మక్తల్ టేకులపల్లి శివారులోని జాతీయ రహదారిపై నిర్మించిన టోల్‌ప్లాజా( Toll Plaza ) పేరు మార్చి టేకులపల్లిగా నామకరణం చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ( MP DK Aruna ) కు గ్రామస్థులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు నర్సింలు, శ్రావణ్ మాట్లాడుతూ గ్రామ శివారులో జాతీయ రహదారిపై నిర్మించిన టోల్ ప్లాజాకు, శివారులో ఉన్న గ్రామం పేరు కాకుండా కాచువార్ గ్రామం పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
టోల్‌ప్లాజాకు పెట్టిన పేరును తొలగించి టేకులపల్లి టోల్‌ప్లాజాగా నామకరణం చేసే విధంగా నేషనల్ హైవే అథారిటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ సానుకూలంగా స్పందించారని వారు వెల్లడించారు. ఇదే సమస్యపై కేంద్ర జాతీయ రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి లేఖ పంపామని గుర్తుచేశారు.
నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణపేట ఆర్డీవోకు , తహసీల్దార్, మక్తల్ సబ్ ఇన్స్పెక్టర్, నేషనల్ హైవే అథారిటీ ఈఈ కి వినతిపత్రాలు పంపించామని తెలిపారు. ఎంపీకి వినతిపత్రం అందించిన వారిలో టేకులపల్లి గ్రామ ప్రజలు కిష్టయ్య, కిష్టప్ప, అంజప్ప, శివకుమార్, శ్రీను, కురుమూర్తి తో పాటు తదితరులు ఉన్నారు.