హైదరాబాద్, మే 25: శిక్షణ పొందుతున్న ఐఏఎస్‌లకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) దిశానిర్దేశం చేశారు. సోమవారం లోక్ భవన్లో 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లతో ముచ్చటించిన ఆయన నిజాయితీ, నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని సూచించారు. ప్రజలతో అనుసంధానమై, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ సుపరిపాలనకు కృషి చేయాలని ట్రైనీ ఐఏఎస్‌లను గవర్నర్ కోరారు.
లోక్ భవన్లో సోమవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ట్రైనీ ఐఏఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. శిక్షణలో ఉన్న ఎట్టబోయిన సాయి శివాని, సచిన్ బసవరాజ్ గుత్తూర్, పోతరాజు హరి ప్రసాద్, పారస్ కుమార్, పి. సురేష్, నెలటూరు శ్రీకాంత్ రెడ్డిలకు గవర్నర్ కీలక సూచనలు చేశారు.
ట్రైనీ ఐఏఎస్‌లతో మాట్లాడుతున్న గవర్నర్

ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిశోర్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ శాంతి కుమారి, కోర్స్ డైరెక్టర్ డా. కందుకూరి ఉషారాణి పాల్గొన్నారు.