అమరచింత, జూన్ 23 : అమరచింత ముద్దుబిడ్డ, తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ దివంగత సాయిచంద్ ఆశయ సాధనకు కృషి చేద్దామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్పర్సన్ రజినీసాయిచంద్ పేర్కొన్నారు. సోమవారం ఆమె ఆత్మకూర్, అమరచింత మం డల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి సాయిచంద్ రెండో వర్ధంతికి సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 29న అమరచింతలో సాయిచంద్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభకు ఉమ్మడి జిల్లాకు చెందిన కళాకారులు, బీఆర్ఎస్ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆత్మకూర్, అమరచింత మండలాల అధ్యక్షుడు రవికుమార్, రమేశ్, మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, రేచింతల పీఏసీసీఎస్ అధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాగభూషణంగౌడ్, నాయకులు నరసింహులుగౌడ్, లెనిన్ తోపాటు సాయిచంద్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.