ఊట్కూర్ : పేకాట స్థావరంపై ( Poker base ) దాడులు నిర్వహించిన పోలీసులు నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణంరాజు( SI Krishnamraju) తెలిపిన వివరాలు మేరకు.. ఊట్కూర్ (Ootkur) మండల శివారులో శనివారం మధ్యాహ్నం సమయంలో కొందరు వ్యక్తులు నగదుతో పేకాట ఆడుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారని వివరించారు.
ఈ దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 7,700 నగదు, ఆరు సెల్ఫోన్లను , మూడు బైక్ లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకుని నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు. గేమింగ్ ఆక్ట్ ప్రకారం ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై వివరించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.