మహబూబ్‌నగర్ విద్యావిభాగం, డిసెంబర్ 19 : ప్రతి ఒక్కరికీ ఆంగ్ల పరిజ్ఞానం అత్యవసరమని పాలమూరు యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ జీఎన్.శ్రీనివాస్ అన్నారు. గురువారం ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన ఒకరోజు జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ భాషల్లో ఆంగ్ల భాషకే అత్యధిక ప్రాధాన్యత ఉందన్నారు. ‘హైబ్రిడింగ్ అండ్ బిలాంగింగ్- ఇంగ్లీష్ ఇన్ ఏ ట్రాన్సిషనల్ వరల్డ్’ అనే అంశంపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి హాజరైన రీసెర్చ్ స్కారల్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తమ పరిశోధన పత్రాల్ని ఆన్లైన్ ఆఫ్‌లైన్‌లో సమర్పించారు.
జమ్ముకాశ్మీర్, మహారాష్ట్ర, కేరళ, ఛత్తిస్ఘడ్, కర్ణాటక, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ర్టా నుంచి హాజరయ్యారు. జాతీయ సదస్సుకు ప్రధాన వక్తగా తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేవీ.రఘుపతి, ఆంధ్రప్రదేశ్ పులివెందుల జేఎన్టీయూ అసోసియేట్ ప్రొఫెసర్ సాంబయ్య ప్లీనరీ స్పీకర్లుగా వ్యవహరించారు. ఈ సదస్సు కన్వీనర్, హెచ్‌వోడీ జి.రంగ సూర్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 132 పరిశోధనా పత్రాల్ని సమర్పించారని తెలిపారు.
హాంకాంగ్ దేశం నుంచి హాంకాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పి. జాసన్ తన పరిశోధన పత్రాల్ని సమర్పించారు. సదస్సు లో కళాశాల ప్రిన్సిపాల్ కె.పద్మావతి, అధ్యాపకులు ఖాదర్‌వలీ, వి.రామన్‌గౌడ్, ఉమారాపాక, జాస్పర్ సుకీర్తి, శారద, కిరణ్, బాలకృష్ణ, నిహారిక, కృష్ణమూర్తి, రవీందర్, మల్లికార్జున, పీయూ ఇంగ్లీశ్ విభాగాధిపతి జే.మాలవి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 19: మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చే ఏడాది మార్చినెల చివరి వరకు సాగునీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టు పరిధిలో సాగుకు అనుకూలంగా ఉన్న 2.8 లక్షల ఎకరాకు సాగునీటిని అం దించనున్నట్లు బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో కేఎల్ఐ ద్వారా సాగునీటిని అందిం చే విషయమై నిర్ణయించినట్లు రాష్ట్ర నీటి పారుదలశాఖ ఎస్ఈ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని అందుకులోబడి సాగునీరు అందించనున్నారు.