హన్వాడ : గత ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను (Farmers promises) వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ( BJP) ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్కార్యాలయం ఎదుట ధర్నా ( Dharna) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకు బోనస్ డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు.
కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ రైతు భరోసా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కొండ శివలింగం. మాజీ ఎంపీపీ వడ్ల శేఖర్, నాయకులు బుచ్చిరెడ్డి, కృష్ణయ్య గౌడ్, కుర్మిరెడ్డి, రమణారెడ్డి, వెంకటయ్య రఘురాం గౌడ్, చెన్నప్ప, వేణు ,తదితరులు పాల్గొన్నారు.