అయిజ, జూలై 14 : రాంగ్ రూట్లో వచ్చి న ప్రైవేట్ పాఠశాల బస్సు బ్రేకులు ఫెయిల్ కా వడంతో రోడ్డుపైకి దూసుకొచ్చింది. దీంతో రో డ్డుపై దుకాణాల ఎదుట నిలిపిన ఐదు ద్విచక్ర వాహనాల్లో రెండు పూర్తిగా, 3 పాక్షికంగా ధ్వంసమయ్యాయి. సోమవారం అయిజ పట్టణంలోని నవభారత్ ఉన్నత పాఠశాలకు చెందిన బస్సు (ఏపీ 15 టీబీ 3498)లో పిల్లలను ఎక్కించుకొని పల్లెలకు వెళ్లేందుకు సిద్ధమైంది.
పాఠశాల నుంచి తెలంగాణ చౌరస్తా స మీపంలో ప్రధాన రోడ్డుపైకి డ్రైవర్ రాంగ్ రూ ట్లో తీసుకొచ్చారు. బస్సును అదుపు చేసేందుకు ప్రయత్నించినా బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సును డ్రైవర్ కంట్రోల్ చేయలేక అదుపుతప్పి దుకాణాల ఎదుట ఉన్న ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. బస్సులో దాదాపు 45 మంది వరకు విద్యార్థులు ఉండగా, ఎ లాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్ర మాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.
రెం డు రోజుల కిందటే రవాణశాఖ అధికారులు బ స్సుల ఫిట్నెస్ పరిశీలించినా, ఆలా బస్సు బ్రే కులు ఫెయిల్ కావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిట్నెల్ లేని పాఠశాలల వాహనాలను సీజ్ చేయాల్సి ఉండగా, కొన్ని కాలం చెల్లిన వాహనాలనే పా ఠశాలల యాజమాన్యాలు రోడ్లపై తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఫిట్నెస్ లేని వాహనాలన్నింటినీ సీజ్ చేయాలని, కండిషన ల్ ఉన్న వాహనాలు అన్ని అనుమతులతో నడపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.