నారాయణపేట : రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET Exam ) పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా పాలీసెట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. శ్రీనివాసులు ( M. Srinivasulu ) తెలిపారు. నారాయణపేటలో 3 కేంద్రాలు, కొస్గి(Kosigi )లో 2 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1,330 విద్యార్థులకు గాను 1,225 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని వివరించారు. 105 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మొత్తం హాజరు శాతం 92.08గా నమోదైందన్నారు.
పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించామని వివరించారు. జిల్లా అధికారులు, కేంద్రాధిపతులు, ఇన్విజిలేటర్లు, పోలీసు సిబ్బంది సమన్వయంతో పరీక్షను ఎటువంటి అంతరాయం లేకుండా విజయవంతంగా నిర్వహించినట్లు శ్రీనివాసులు వెల్లడించారు.