ఎర్రవల్లి చౌరస్తా, డిసెంబర్ 13: తెలంగాణలో పోలీస్ మానిటరింగ్ చాలా బాగుందని ఐజీ వెస్ట్‌జోన్(ఐపీఎస్)వీ.బీ. కమలహాసన్‌రెడ్డి తెలిపారు. జోగుళాంబ గద్వాల ఎస్పీ రంజన్ రతన్కుమార్తో కలసి వార్షిక తనిఖీల్లో భాగంగా కోదండాపూర్‌లోని అలంపూర్ సీఐ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరశీలించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. తనిఖీల్లో భాగంగా సర్కిల్ పరిధిలో నమోదవుతున్న గ్రేవ్కేసుల వివరాలు, లా అండ్ఆర్డర్ అమలు నిర్వహణ, ఏడాదిలో ఎటాంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు వివరాలను సీఐ సూర్యానాయక్‌ను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా 5ఎస్ అమలు తీరు, పెండింగ్ కేసులను త్వరగా పూర్తిచేయాలని, డిమాండ్ డైరీ చార్జిషీట్, ఇంటరాగేషన్, రిపోర్ట్స్ ఆన్లైల్ ఎంట్రీ తీరును పరిశీలించాఉ. సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లలో డయల్ 100 కాల్ రాగానే వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాని సూచించారు. 24గంటలు గస్తీ నిర్వహించేటట్లు ఆయా ఎస్సైలతో చర్యలు జరపాలని సూచించారు.
అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మంచి పోలీస్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాడానికి సహకారాలు అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని, ప్రజలందరూ నిర్భయంగా ఉంటున్నారని తెలిపారు. ఎస్పీ రంజన్త్రన్ కుమార్, డీఎస్పీ సంవర్థవంతంగా లా అండ్ఆర్డర్ను నిర్వహిస్తూ బాగా పనిచేస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ రంగాస్వామి, ఎస్సైలు వెంకటస్వామి, గోకారి, శ్రీహరి, పోలీసు సిబ్బంది పాల్లొన్నారు.