కొత్తకోట : సంఘ సంస్కర్త పొగాకు బసవమ్మ (Pogaaku Basavamma ) ఆశయ సాధనకు కృషి చేయాలని కొత్తకోటకు చెందిన నాయకులు అన్నారు. కొత్తకోట( Kottakota) మున్సిపాలిటీ కేంద్రంలోని మాజీ మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషిణి విశ్వేశ్వర్ నివాసంలో జరిగిన పొగాకు బసవమ్మ వర్ధంతి సభలో మాజీ జడ్పీటీసీలు పొగాకు విశ్వశ్వర్, డాక్టర్ పీజే బాబు మాట్లాడారు.
బసవమ్మ ఉమ్మడి కుటుంబానికి క్రమశిక్షణ నేర్పి ఆదర్శంగా నిలిచారని, ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఎన్.జే బోయేజ్, మాజీ కౌన్సిలర్లు పద్మ అయ్యన్న, మహేశ్వరి రాములు యాదవ్, ఖాజమొయినోద్దిన్ , బీఆర్ఎస్ నాయకులు వైఎస్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల , అంగన్వాడీ కేంద్రాల విద్యార్థులకు బ్యాగులు పంపిణి చేశారు. ఆమె పేరిట అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కో అప్షన్ సభ్యులు, వివిధ పార్టీల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.