జడ్చర్ల, డిసెంబర్ 3 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌లో వల్లూ రు, ఉదండాపూర్, గ్రామాలతో పాటు తండా ఇండ్లు ముంపునకు గురవుతున్నాయి. ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు ప్రభుత్వం నోటిపికేషన్ జారీ చేసిన రోజు వి లువ కంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఇంటి నిర్మాణాలకు, స్థలాలకు పరిహారం చెల్లించాలని ఉదండాపూర్ రిజర్వాయర్‌లో ముం పునకు గురవుతున్న గ్రామాల ప్రజ లు ఆర్అండ్ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతి చేశారు.
మంగళవారం జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు నిర్వాసితులతో ఆర్అండ్ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలతో వేరువేరుగా అభిప్రాయాలను సేకరించారు. ప్రాజెక్టు కోసం ఇచ్చిన నోటిపికేషన్లో పేర్కొన్న పరిహారం కన్నా ప్రస్తుతం 2024మార్కెట్ విలువ ప్రకారం ఇంటికి, ఖాళీ స్థలాలకు రేట్లు పెంచి పరిహారం ఇవ్వాలని, 2024 వరకు పరిగణించి 2024 వరకు 18ఏండ్లు నిండిన వారిని కూడా ఒక కుటుంబంగా పరిగణించి పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే ఉదండాపూర్ రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన గ్రామాల భూనిర్వాసితుల నుంచి వారి సమస్యలను తెలుసుకోవడానికి వచ్చిన ఆర్అండ్ఆర్ కమిషనర్‌కు తమ అభిప్రాయాలు తెలుపాలని వచ్చిన వారందరిని వారిదగ్గరకు వెళ్లకుండా కొందరిని మాత్రమే పంపించడంతో నిర్వాసితులు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. అందరినీ కాకుండా గ్రామానికి కొంతమందిని మాత్రమే వారిదగ్గరకు అనుమతించారు. సమావేశం లో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, జిల్లా ఎస్పి జానకితో పాటు ఆర్అండ్బీ, ఇరిగేషన్, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.