మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని ప్రజలు సోమవారం హోలీ పండుగను సంబురంగా జరుపుకొన్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పు నీతమైనదని అర్థం. హోలీకి ముందురోజు రా త్రి కామదహనం చేశారు. చిన్నారులు వాటర్గన్లతో రంగులు చల్లుకుంటూ సందడిగా గడిపారు. గ్రామాల్లో మహిళలు బొడ్డెమ్మ వేస్తూ, ఇంటింటికీ తిరిగి పాటలు పాడుతూ హోలీ ఆడగా.. పట్టణాల్లో రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు యువత స్టెప్పులేస్తూ సందడిగా గడిపారు.