పేదోడి ఫ్రిజ్లు
పేదోడి ఫ్రిజ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్రిజ్లు కొనుక్కునే స్థ్ధోమత లేని వారికి, ఫ్రిజ్ ఉన్నా వాటిలోని నీరు తాగని వారికోసం రంజన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. వేసవికాలం రావడంతోనే జిల్లా కేంద్రంలో రంజన్ల కొనుగోలు ప్రారంభమైంది.
- మట్టి పాత్రలపై మక్కువ పెంచుకుంటున్న ప్రజలు
- జోరుగా కొనుగోళ్లు
- ఆరోగ్యానికి మట్టి పాత్రలే మేలు
నెట్వర్క్ మహబూబ్నగర్, మే 14 : పేదోడి ఫ్రిజ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్రిజ్లు కొనుక్కునే స్థ్ధోమత లేని వారికి, ఫ్రిజ్ ఉన్నా వాటిలోని నీరు తాగని వారికోసం రంజన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. వేసవికాలం రావడంతోనే జిల్లా కేంద్రంలో రంజన్ల కొనుగోలు ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లపై ఎక్కడా చూసినా రంజన్ల విక్రయాలు ఊపందుకున్నాయి. ఫ్రిజ్ నీటి కన్నా రంజన్ నీళ్లే మేలని నిపుణులు చెబుతున్నారు. రంజన్ల గిరాకీ కూడా విపరీతంగా పెరిగింది. అంతే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మట్టి కుండలే శ్రేష్ఠమని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్ నీళ్లు తాగడంతో ఆరోగ్య సమస్యలు వస్తాయని, రోగాలబారిన పడకుండా రంజన్లనే వాడేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కుండ నీళ్లు ఆరోగ్యానికి మంచివని ఇప్పుడు ఎక్కువగా రంజన్ నీళ్లనే తాగుతున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఉచిత తాగునీటిని రంజన్ల ద్వారానే ప్రజలకు అందిస్తున్నారు.
పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ..
ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నేడు పూర్వ పద్ధతుల వైపు మళ్లుతున్నారు. మట్టి రంజన్ల వినియోగంతో పర్యావరణ పరిరక్షణకు కృషిచేసిన వారమవుతాం. కుమ్మరి శాలివాహన కువృత్తుల వారికి కూడా ఉపాధి కూడా లభిస్తుంది. ప్లాస్టిక్ నివారణ సాధ్యమవుతుంది. వీటన్నింటితో ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన కుండలను వాడుతున్నారు. మట్టి పాత్రలో తయారు చేసిన ఆహార పదార్థాలతో మన ఆరోగ్యానికి కావాల్సిన 18 రకాల మైక్రో న్యూట్రిన్లు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అల్యూమినియం, స్టీల్ పాత్రలలో వండిన వంటకాలలో మైక్రో న్యూట్రిన్లు తక్కువగా ఉంటాయి. మట్టి పాత్రకు వేడి తగలగానే మట్టిలో కంటికి కనబడని కిరణాలు వెలువడి పదార్థాలన్నీ శుద్ధిగా మారేవని, అందుకే పూర్వీకులు ఆరోగ్యపరంగా దిట్టంగా ఉండేవారని చెబుతున్నారు.
సీజన్ మొదలయ్యింది..
వేసవి కాలం వచ్చిందంటే మాకు చేతినిండా పనులు ఉంటాయి. ఇప్పటికే సీజన్ మొదలయ్యింది. నే టి తరానికి తగ్గట్టుగా రంజన్లే కా కుండా వాటికి నల్లాలను బిగిం చి అమ్ముతున్నాం. మట్టి కుక్కర్లు, వా టర్ బాటిళ్లు తదితర వస్తువులను తయారు చేసి అమ్ముతున్నాం.
-రమేశ్, కుమ్మరి సంఘం అధ్యక్షుడు
మంచి రాబడి వస్తుంది…
గతంలో ఫ్రిజ్లోని నీటిని మాత్రమే తాగేవారు. నేడు ప్ర తి ఒక్కరూ మట్టి కుండలకు అలవాటు పడుతున్నారు. దీంతో మాకు కూడా మంచి రాబడి వస్తుంది. చల్లని నీటి కోసం మట్టి పాత్రలను ఎక్కువగా తీసుకెళ్తున్నారు. మట్టి కుండల్లోని నీటిని తాగడంతో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
– కృష్ణ, కుండలు అమ్మే వ్యాపారి
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

