జడ్చర్ల, జూన్ 15 : దశాబ్ది ఉత్సవాల్లో భాగం గా గురువారం జడ్చర్ల మండలంలోని 45 గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలను మామిడితోరణాలతో, ఆరుబయట రంగవల్లులతో సుందరంగా అలంకరించారు. ఉద యం 9 గంటలకు అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచులు జాతీయపతాకాలను ఎగురవేశారు. అనంతరం గ్రామాల్లో ర్యాలీలు చేపట్టి గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులను సన్మానించా రు. జడ్చర్ల మండలం గొల్లపల్లిలో సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. పారిశుధ్య కార్మికులను సన్మానించారు. అదేవిధంగా దేవునిగుట్టతండాలో సర్పంచ్ రాములునాయక్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించి గ్రామసభను నిర్వహించారు.
గ్రామాల రూపురేఖలు మారిన
దేవరకద్రరూరల్(కౌకుంట్ల), జూన్ 15 : పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల రూపురేఖలు మారినట్లు తాసీల్దార్ బ్ర హ్మం పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లెప్రగతి ర్యాలీ నిర్వహించి, పంచాయతీ కార్యాలయాలపై జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా గ్రామాల అభివృద్ధి పై సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని సన్మానించారు. పేరూర్లో నిర్వహించిన పల్లెప్రగతి దినోత్సవంలో తాసీల్దార్ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల స ర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అం గన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజాపూర్‌లో..
రాజాపూర్, జూన్ 15 : గ్రామాల అభివృద్ధిలో పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివని డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బచ్చిరెడ్డి జాతీ య జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీల, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, తాసీల్దార్ రాంబాయి, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీ వో వెంకట్రాములు, ఉపసర్పంచ్ శ్రీనివాస్, యాదగిరి, రమేశ్, సత్యయ్య పాల్గొన్నారు.
మహ్మదాబాద్‌లో..
మహ్మదాబాద్, జూన్ 15 : తెలంగాణ ప్రభుత్వంలో పల్లెల రూపురేఖలు మారిపోయాయని ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. పల్లెప్రగతి దినోత్సవం సందర్భంగా గురువా రం మండలంలోని ఆయా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి గ్రామ పంచాయతీల కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంత రం ఆయా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు ఉత్త మ సేవలు అందించిన గ్రామ పంచాయతీ వర్కర్లకు నూతన వస్ర్తాలు అందించి ఘనంగా సన్మానించారు. మండలంలోని కంచన్‌పల్లి, మొకర్లబా ద్ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి, భిక్షపతి, పెం ట్యానాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
మిడ్జిల్‌లో..
మిడ్జిల్, జూన్ 15 : పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీ సీ శశిరేఖ అన్నారు. గురువారం మండల కేంద్రంతోపాటు వాడ్యాల్ గ్రామాల్లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లెప్రగతితో గ్రామాల్లో జరిగిన మార్పులపై చర్చించారు. పారిశుధ్య కార్మికులను ఘనం గా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచులు రాధిక, మంగమ్మ, ఎంపీటీసీ గౌస్, ఉప సర్పంచ్ పద్మ, గోపాల్, చంద్రశేఖర్, బాలస్వామి, ఉస్మా న్, సుకుమార్, శ్రీనివాసులు ఉన్నారు.
గండీడ్‌లో..
గండీడ్, జూన్ 15 : గ్రామాల అభివృద్ధే ల క్ష్యంగా ప్రభత్వం పనిచేస్తుందని ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వెన్నాచేడ్, జానంపల్లి, పెద్దవార్వ ల్, సల్కర్‌పేట్, పగిడ్యాల్, బల్సుర్‌గొండ, కొండాపూర్, గండీడ్, కొంరెడ్డిపల్లి, ఆశిరెడ్డిపల్లి, చిన్నవార్వల్, సాలార్‌నగర్, రుసుంపల్లి, జిన్నారం, లింగాయిపల్లి, జక్లపల్లి తదితర గ్రామాల్లో పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కోయిలకొండలో..
కోయిలకొండ, జూన్ 15 : బీఆర్ఎస్ ప్రభు త్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రా మ పంచాయతీల దశ మారిందని ఎంపీపీ శశికళాభీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారుపల్లి, కోయిలకొండ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీలు నేడు పట్టణ ప్రాంతాలుగా అభివృద్ధి సాధించాయన్నారు. పంచాయతీ సిబ్బందిని శాలువాతో సత్కరించారు. మండలంలోని గ్రామపంచాయతీలో జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మధుసూదన్‌గౌడ్, సర్పంచులు కృష్ణయ్య, మాణిక్యమ్మ, వైస్‌ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, ఎంపీటీసీ ఆంజనేయులు, ఎంపీడీవో జయరాం, హెచ్ఎం వెంకట్‌జీ, కార్యదర్శి రమేశ్, చంద్రశేఖర్, నాయకులు యాదయ్య, జగన్‌గౌడ్, శ్రీను పాల్గొన్నారు.
Mahabubnagar2
నవాబ్‌పేటలో..
నవాబ్‌పేట, జూన్ 15 : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి ది నోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. మొదట గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి, గ్రామ పంచాయ తీ కార్యాలయాల ఎదుట జాతీయ పతాకాన్ని ఎ గురవేశారు. గ్రామ సభలు నిర్వహిం చి, తెలంగాణలో సాధించిన ప్రగతిపై చర్చించారు. గ్రామాల్లో సేవలందిస్తున్న పంచాయతీ సిబ్బందిని పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించా రు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీ సీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, వైస్‌చైర్మన్ చందర్‌నాయక్, ముడా డైరెక్టర్ చెన్నయ్య, తాసీల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, సర్పంచులు గోపాల్‌గౌడ్, జయమ్మ, గౌసియాబేగం, లక్ష్మమ్మ, లక్ష్మారెడ్డి, జం గయ్య, లలితమ్మ, జంగమ్మ, బొజ్జ మ్మ, సత్యం, కృష్ణయ్య, సౌజన్య, లత, వెంకటేశ్, పాండురంగారెడ్డి పాల్గొన్నారు.
పాలమూరులో..
పాలమూరు, జూన్ 15 : తెలంగాణ దశాబ్ది దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవాన్ని మండలంలోని కోడూ రు, దివిటిపల్లి, గాజులపేట, కోటకదిర, జమిస్తాపూర్ ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు చేశారు. దివిటిపల్లి లో అర్బన్ తాసీల్దార్ పార్థపారధి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, సర్పంచులు శ్రీకాంత్‌గౌడ్, జరీనాబేగం, చంద్రశేఖర్, మల్లు రమ్య, రాంచంద్రయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
దేవరకద్రలో..
దేవరకద్ర, జూన్ 15 : మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే కార్మికుల సహకా రం ఉందని ఎంపీడీవో శ్రీనివాసులు అన్నారు. గు రువారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్ కొండ విజయలక్ష్మి గ్రామ పంచాయతీ కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో ఎం పీడీవో శ్రీనివాసులు, సర్పంచ్ విజయలక్ష్మీ, పం చాయతీ కార్యదర్శి సీతానాయక్ పాల్గొన్నారు.