
మహబూబ్‌నగర్, డిసెంబర్ 13 : మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం జనరల్ దవాఖానలో రూ.కోటి తో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్‌నగర్, జడ్చర్ల దవాఖానల్లో రూ.5 కోట్లతో పిల్లలకు ప్రత్యేకించి 32 పడకల కొవిడ్ విభాగాలు ఏర్పా టు చేయనున్నట్లు చెప్పారు. పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించనున్నట్లు తెలిపారు. గతంలో దవాఖానలో ఒక ఐసీయూ బెడ్ కూడా ఉండేది కాదని, ఇప్పుడు 67 ఐసీయూ, 567 ఆక్సిజన్ పడకలున్నాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, మెడికల్ కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్, డీఎంహెచ్‌వో కృష్ణ, ఆర్ఎంవో జీవన్ తదితరులు ఉన్నారు.
రెడ్‌క్రాస్‌కు ప్రథమ స్థానం..
ఆపదలో అండగా నిలుస్తున్న రెడ్‌క్రాస్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం చాలా సంతోషకరమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం ఇండియన్ రెడ్‌క్రాస్‌లో రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన సిలిల్డోనర్ ప్లేట్లెట్స్ యంత్రాన్ని, ఇండియన్ రెడ్‌క్రాస్‌కు అనుసంధానంగా ఉన్న జనరిక్ ముందుల షాపును ప్రారంభించారు.
ఎంబీబీఎస్‌లో సీట్లు సాధించిన విద్యార్థులు గోపిక, హరిత, శిరీషను శాలువాతో సన్మానించారు. వీరి ముగ్గురికి రెడ్‌క్రాస్ తరఫున, కలెక్టర్ సహకారంతో ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు సహకారం అందిస్తామని తెలిపా రు. జిల్లాకు చెందిన రెడ్‌క్రాస్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బెక్కెం జనార్దన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైనందుకు సన్మానించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ జి ల్లా అధ్యక్షుడు లయన్ నటరాజ్, కార్యదర్శి డాక్టర్ శ్యా ముల్, కోశాధికారి జగపతిరావు, డాక్టర్ రమణయ్య, లయన్ గాంధీ, డాక్టర్ రజిని, తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబాలకు అండ..
ధర్మాపూర్ గ్రామానికి చెందిన కురుమూర్తి ఆదివారం ప్రమాదవశాత్తు మరణించారు. కాగా, క్యాంప్ కార్యాలయంలో మృతుడి భార్య మాసమ్మకు రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. మాసమ్మకు ధర్మాపూర్లోని వసతి గృహంలో తాత్కాలికంగా ఉద్యోగం కల్పిస్తామని, ఇద్దరు ఆడపిల్లలకు హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. అనంతరం 22 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.28.51 లక్షల చెక్కులను బాధి త కుటుంబసభ్యులకు అందజేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అర్బన్ తాసిల్దార్ పార్థసారథి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.