కొత్త సంవత్సరంలోకి అడుగిడిన వేళ నూతనోత్తేజం ఉట్టిపడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. డిసెంబర్ 31న విందు, వినోదాలతో ఆనందంగా సందడి చేశారు. పటాకులు కాల్చుతూ సంబురాలు కేరింతలు కొడుతూ కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు.
కేక్ కటింగ్‌లు, న్యూ ఇయర్ విషెస్‌తో సందడి నెలక్నొది. కోటి ఆశలతో ప్రణాళికలు రూపొందించుకొని.. సంతోషంగా గడిపారు. మహిళలు ఇండ్ల ముందు రంగవల్లులు వేశారు. చిన్నాపెద్ద అంతా ఆలయాలను దర్శించుకున్నారు. క్రైస్తవులు చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. పార్కులు.. పర్యాటక ప్రాంతాలకు తాకిడి పెరిగింది. వేడుక ప్రజల్లో జోష్ నింపింది.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, జనవరి 1