మాగనూర్, ఆగస్టు 25 : మాగనూరు ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘా ల్లో అధికారుల నిర్లక్ష్యంతో 51 మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. రుణ వివరాలను సొసైటీ సి బ్బంది నమోదు చేయడం లో అలసత్వం వహించారు. దీంతో అన్ని అర్హతలున్నా అధికారుల నిర్లక్ష్యమే త మను నిండా ముంచిదని రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిబ్బం ది తప్పుల తడకగా డేటాను ఎంట్రీ చేయడమే కా కుండా 51 మంది రైతుల వివరాలు ఆన్లైన్లో న మోదు చేయలేదు.
రెండేండ్ల కిందట తీసుకున్న రు ణాల వివరాలను ఎందుకు ఎంట్రీ చేయలేదని రైతు లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సహకార సంఘంలో 1,438 మంది రైతులు రూ.పదివేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకోగా.. కేవలం 559 మందికి మాత్రమే రుణమాఫీ పథకం వర్తించింది. ఇంకా 879 మందికి మాఫీ కాలేదు. కానీ అధికారులు మాత్రం రేషన్ కార్డులో ఒకరు ఉన్నారు. ఇ ద్దరు ఉన్నారని ఇలా అనేక కారణాలు చెబుతుండడంతో రైతులు పీఏసీసీఎస్ అధికారులు, వ్యవసాయాధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వ స్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక పక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేషన్‌కార్డు ప్రామాణికం కాదని చెప్పినా.. అధికారులు మాత్రం రేషన్ కార్డు ను ఏ ప్రామాణికంగా తీసుకున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొన్నది. అదే పీఏసీసీఎస్‌లో ఎన్.నాగేంద్ర రూ.15 వేల రుణం తీసుకోగా తప్పుడు లెకలు చేసి రూ.1,01,438 రుణం ఉన్నట్లు సృష్టించారు. వివరాల నమోదులో ఎన్.నాగేంద్ర బదులు ఎం. నాగేంద్ర అని ఎంట్రీ చేయడంతో మాఫీ కాక ఇ బ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై సిబ్బంది, అధికారులను అడిగితే.. మేము తప్పుగా ఎంట్రీ చే యలేదం టూ ఒకరిపై ఒక రు నెపాన్ని నెట్టుకుం టున్నారు.
అంతేకాకుండా సిబ్బంది రుణమాఫీ అయిన రైతుల నుంచి రూ.వెయ్యి నుంచి రెండు వేల వరకు వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. సహకార సంఘం సీఈవో గో వర్ధన్‌రెడ్డిని వివరణ కోరగా.. 51 మంది వివరాలు డేటా ఎంట్రీ చేయకపోవడంతో రూ.2 లక్షల రుణమా ఫీకి దూరం అవుతున్నారన్నారు. వివరాలు ఎందుకు నమోదు చే యలేదని అడగగా.. అ మెరికా టూర్ వెళ్లిన సం దర్భంలో ఇలా జరిగి ఉంటుందని ని ర్లక్ష్యంగాసమా ధానమి చ్చారు.
మాగనూరు పీఏసీసీఎస్‌లో 2023 అక్టోబర్ 16వ తేదీన రూ.లక్ష లోన్ తీసుకున్నాను. అయితే, ఇప్పుడు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో నా రుణం మాఫీ అవుతుందని భావించాను. కానీ, అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీ జాబితాలో నా పేరే లేదు. రుణమాఫీ అవుతుం దా? లేదా? అని అధికారులను అడిగితే బ్యాంకర్లపై.. వారిని అడిగితే అధికారులపై నెట్టుకుంటున్నారు. ఇక మాఫీ అవుతుందన్న నమ్మకం పోయింది.
– పార్వతమ్మ, రైతు, మాగనూరు
మాగనూరు పీఏసీసీఎస్‌లో 2023 అక్టోబ ర్ 4న రూ.80వేల రుణం తీసుకున్నాను. లిస్టులో నా పేరే లేదు. అధికారుల త ప్పిదం వల్లే రుణమాఫీ కాలేదు. వారు డేటా ఎంట్రీ తప్పులు చేయడంతోపాటు కొంత మంది పేర్లు ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్లే మేం నష్టపోయాం. ఇప్పటికైనా సిబ్బంది తప్పులను సరిచేసి అర్హులకు రుణమాఫీ అయ్యేందుకు సహకరించాలి.
– అంజప్ప, రైతు, ఓబులాపూర్