మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 16 : జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఫాస్ట్-5 సీనియర్ మహిళా, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ ము గిసింది. మంగళవారం జరిగిన ఫైనల్లో పురుషుల విభాగంలో హర్యానా జట్టు 32-20తో తెలంగాణ పై గెలిచింది. మహిళల విభాగంలో హర్యానా జట్టు 43-23తో కర్ణాటకపై విజయం సాధించింది. మ హిళా విభాగంలో తెలంగాణ, ఢిల్లీ, పురుషుల విభాగంలో ఢిల్లీ, కేరళ జట్లు మూడోస్థానంలో నిలిచాయి.
గెలుపోటములు సమానంగా స్వీకరించాలి : యెన్నం
క్రీడల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీల ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయస్థాయి టోర్నీలకు దాతలు ముందు కు రావడం సంతోషంగా ఉందన్నారు. నాలుగు రోజులపాటు దేశంలో 28 రాష్ర్టాల క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వడం, మహబూబ్‌నగర్ ప్రేమ, అప్యాయాతను పొందారని గుర్తుచేశారు. క్రీడలతో స్నేహభావం పెరుగుతుందని, ఇలాంటి టోర్నీని ఏటా నిర్వహించాలన్నారు.
జిల్లాలో ప్రతిభగల క్రీడాకారులకు కొదవలేదని, ఎంతో మంది జాతీయ, అం తర్జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ విజేందర్‌సింగ్, టోర్నీ చైర్మన్ అమిత్అరో రా, కన్వీనర్ అకాశ్బత్ర, నెట్‌బాల్ ఫెడరేషన్ ఎంపై ర్ బోర్డు చైర్మన్ అశోక్ఆనంద్, జిల్లా క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్, రాష్ట్ర నెట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సురేశ్‌కుమార్, అసోసియేషన్ జిల్లా అధ్య క్ష, కార్యదర్శులు ఆదిత్యరెడ్డి, ఖాజాఖాన్, ఉపాధ్యక్షుడు సాదత్‌ఖాన్, ట్రెజరర్ సోహెల్, రామ్మోహన్, అంజద్, షకీల్, అక్రం తదితరులు పాల్గొన్నారు.