భూత్పూర్/జడ్చర్లటౌన్, జనవరి 11 : దేశంలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా భారత్‌ను మారుస్తారని రిటైర్డ్ సీర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆనంద్ అన్నారు. కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కాంక్షిస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా వేముల నుంచి ఆనంద్ చేపట్టిన పాదయాత్ర బుధవారం భూత్పూర్కు చేరింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పూలమాల, శాలువాతో ఆయనను సన్మానించి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సత్తూర్ నారాయణగౌడ్, పట్టణాధ్యక్షుడు సురేశ్‌గౌడ్, బోరింగ్ నర్సింహులు, గడ్డం రాములు, వెంకటయ్య, వెంకటేశ్‌గౌడ్, ప్రేమ్‌కుమార్, యా దయ్య, భీమస్వామి, శ్రీను పాల్గొన్నారు.
భూత్పూర్ నుంచి జడ్చర్లకు చేరిన ఆనంద్ పాదయాత్రకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఆనంద్‌ను శాలువాతో సన్మానించారు. వేముల నుంచి ప్రగతిభవన్‌కు చేపట్టిన పాదయాత్రకు బీఆర్ఎస్ నాయకులు అడుగడుగునా ఘనస్వాగతం పలకడం సంతోషంగా ఉందని ఆనంద్ తెలిపారు. కార్యక్రమంలో ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇంతియాజ్, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్‌రెడ్డి, చైతన్యచౌహాన్, బుక్క మహేశ్, శశికిరణ్, బీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, బాలు, సోహేల్, మహమూద్, హబీబ్, రమేశ్, వెంకటేశ్, రఫీక్, కరీం ఉన్నారు.