Jupally Krishna Rao | ముడుమాల్ నిలువు రాళ్ల పరిరక్షణకు చర్యలు.. యూనెస్కో శాశ్వత గుర్తింపు కోసం కృషి : మంత్రి జూపల్లి కృష్ణారావు
Jupally Krishna Rao | ఇవాళ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్ నిలువు రాళ్ల (మెన్హిర్స్) ను సందర్శించారు. ముడుమల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు.
Jupally Krishna Rao | మగానూర్ కృష్ణ మార్చ్ 16: ముడుమాల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆయన నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్ నిలువు రాళ్ల (మెన్హిర్స్) ను సందర్శించారు.
నిలువు రాళ్లు, సప్తర్షి మండలంతో ఖగోళ పరిజ్ఞానాన్ని, కాలాలను, వాతావరణ మార్పులను ఆనాడే తెలుసుకునేవారని, కాలాలను గుర్తించడానికి ఆది మానవులు నిలువురాళ్లను ఓ క్రమంలో ఏర్పాటు చేసినట్లు చారిత్రక పరిశోధకులు, ఖగోళ శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ఎలాంటి సాంకేతికత లేని 4 వేల సంవత్సరాల క్రితమే రాళ్ల ద్వారా తెలుసుకోవడం అనేది ఆబ్బురపరిచేలా, అద్భుతంగా ఉందని మంత్రి అన్నారు.
ప్రపంచ పటంలో ముడుమల్ పేరు..
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. నిలువు రాళ్లకు యునెస్కో శాశ్వత గుర్తింపు లభిస్తే మాత్రం ప్రపంచస్థాయిలో ప్రత్యేక స్థానం వీటికి దక్కుతుందని, ప్రపంచ పటంలో ముడుమాల్ పేరు నిలుస్తుందన్నారు. అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వీటికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు, మౌలిక వసతులు మెరుగవుతాయని, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. నిలువురాళ్ల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని, పర్యాటక, చారిత్రక, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతామని వివరించారు.
దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, తెలంగాణ హెరిటేజ్ శాఖ, టిటా గ్లోబల్ ట్రస్ట్ సహకారం వల్లే నిలువు రాళ్ళకు ఈ గుర్తింపు లభించిందని వెల్లడించారు. ఈ ప్రాంత అభివృద్ధి, శాశ్వత గుర్తింపు కోసం తదుపరి కార్యాచరణ ప్రణాళిక, తదితర అంశాలపై త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ సైట్లో భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తామని మంత్రి హామీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్,
ఖగోళ శాస్త్ర విభాగ ప్రొఫెసర్ రుక్మిణి, డోసియర్ ఆర్కిటెక్ట్ నిపుణుడు సూర్యనారాయణ,, హెరిటేజ్ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి, రీసెర్చ్ స్కాలర్ డా. ప్రవీణ్, ఆర్డీఓ రాం చందర్ నాయక్, డిఎస్పీ నల్లపు లింగయ్య, టిటా గ్లోబల్ ట్రస్ట్ నిర్వాహకులు సందీప్ మక్తలా, తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Harish Rao | నీ దాకా వస్తే కానీ నొప్పి తెల్వదా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

