నారాయణపేట టౌన్, మే 14: కరోనా తో బాధపడుతున్న ప్రజల సౌకర్యార్థం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హ రిచందన సమక్షంలో ముగ్గురు దాతలు 3 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.శైలజకు అందజేశారు. వర్కటం జగన్నాథ్‌రెడ్డి 2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్‌సుధాకర్ 1 ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను అందజేశారు. కలెక్టర్ హరిచందన ముగ్గురు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.