Attack | కోస్గి, జూన్ 01 : కోస్గి మండల పరిధిలోని సర్జఖాన్ పేట గ్రామానికి చెందిన కుమ్మరి చిన్నయ్య అనే బీఆర్ఎస్ కార్యకర్తను అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత శెట్టి శివకుమార్ విచక్షణారహితంగా దాడి చేశాడు. కుమ్మరి చిన్నయ్యను వృద్దుడని కూడా చూడకుండా మంగళవారం రాత్రి వేళలో శివకుమార్ దాడి చేయడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. సర్జఖాన్ పేట గ్రామానికి చెందిన కుమ్మరి చిన్మయ్య తన ఇంటి దగ్గర ఉన్న చెత్తను తీసి అక్కడే కాల్చి వేయగా.. అటుగా వెళ్తున్న గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత శెట్టి శివకుమార్ మద్యం మత్తులో విచక్షణ మరిచి వృద్దుడని చూడకుండా చిన్నయ్యపై దాడికి దిగాడు. అడ్డు వచ్చిన కుటుంబంలోని మహిళలపై కూడా దాడికి దిగాడు. నేను అధికార పార్టీ నాయకుడినని నన్నెవరూ ఏమి చెయ్యలేరు అంటూ బెదిరింపులకు దిగాడు.
పక్కనే ఉన్న వారు వారించినా అతడు వారిని సైతం బెదిరించారని గ్రామస్థులు వాపోయారు. విచక్షణ మరిచి దాడి చేసిన నిందితునిపై కఠినంగా శిక్షించాలని పోలీసులకు పిర్యాదు చేశారు. గతంలో కాంగ్రెస్ నేత శెట్టి శివకుమార్ జైలు శిక్ష అనుభవించి వచ్చినట్టు గ్రామస్థులు తెలిపారు.
