పెద్దమందడి : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ( Paddy Purchase Centre ) సౌకర్యాలు లేక అటు రైతులు, ఇటు కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో ధాన్యం తరలించకపోవడంతో ప్రకృతి కన్నెర్రతో ధాన్యం తడిసి ముద్దవుతుంది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లి గ్రామంలో కొనుగోలు చేసిన 4వేల బస్తాల ధాన్యం తరలింపులో ఆలస్యం జరుగుతుందడడంతో నమస్తే తెలంగాణ ( Namaste Telangana ) పత్రికలో వార్త ప్రచురితమైంది.
స్పందించిన అధికారులు సోమవారం ఒక లారీ, మంగళవారం రెండు లారీలను ( Lorrys ) కేంద్రాలకు తరలించి సుమారు 2,500 వేల బస్తాల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. మరో 1500 బస్తాల ధాన్యాన్ని రేపటిలోగా తరలింస్తామని ఐకేపీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపించి ధాన్యం బస్తాలను తరలించినందుకు నమస్తే తెలంగాణ దినపత్రికకు, అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.