కొల్లాపూర్ : కొల్లాపూర్‌కు రైల్వే లైన్ కావాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు అన్నారు. మంగళవారం కొల్లాపూర్ పట్టణంలో బీజేపీ కార్యాలయంలో బీజేపీ తరపున గెలుపొందిన సర్పంచులను, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్, వార్డు మెంబర్లకు ఆయన శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సర్పంచుల ఎన్నికల లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
బీసీలకు రేవంత్ సర్కార్ మోసం చేసినందుకు గ్రామాల ప్రజలు బుద్ది చెప్పారన్నారు. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేందుకు సర్పంచ్ అభ్యర్థులను విత్ డ్రా చేయించామన్నారు. కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టిన శని అని పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ధారా సింగ్ పాల్గొన్నారు.