Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Viral Video | కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఓ కార్యకర్త, ప్రస్తుతం విద్యుత్ సరఫరా సరిగా లేక తన వరి పంట ఎండిపోతున్నదంటూ పొలంలోనే కన్నీరు పెట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Viral Video | నాగర్కర్నూల్, అక్టోబర్ 13: తెలంగాణలో విద్యుత్ సరఫరా సమస్యలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయనే అంశానికి నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ఓ రైతు ఆవేదన అద్దం పడుతోంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఓ కార్యకర్త, ప్రస్తుతం విద్యుత్ సరఫరా సరిగా లేక తన వరి పంట ఎండిపోతున్నదంటూ పొలంలోనే కన్నీరు పెట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని తిమ్మాజిపేట మండలం చంద్రాయన్పల్లి తండాకు చెందిన ఇస్లావత్ గోపాల్ తన పొలంలో ఎండిపోతున్న వరి పంటను చూపిస్తూ ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ఓట్లు వేయించేందుకు తాను దగ్గరుండి పనిచేశానని, ఇప్పుడు తన పంటకు నీరు అందక ఎండిపోతున్నదని వాపోయారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసినం. నేనే దగ్గరుండి ఓట్లు వేయించిన. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు’ అంటూ గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలో కరెంటు లేక, నీళ్లు అందక వరి పంట ఎండిపోతున్నదని తెలిపారు. రైతులకు న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డిని కొందరు ఎందుకు పొగుడుతున్నారని, వాస్తవంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎందుకు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రస్తుతం ఐదారు గంటలు కూడా సక్రమంగా కరెంటు రావడం లేదని గోపాల్ ఆరోపించారు. విద్యుత్ వచ్చినా సరైన వోల్టేజీ ఉండటం లేదని, దీంతో మోటార్లు కాలిపోతున్నాయని పేర్కొన్నారు. పొలానికి నీరు పెట్టలేక రెండెకరాల్లో సాగు చేసిన వరి పంట ఎండిపోతున్నదని, ఇప్పటికే సుమారు రూ.40 వేల పెట్టుబడి పెట్టానని తెలిపారు. పంట చేతికందే పరిస్థితి లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
అప్పుడు పార్టీ కండువా.. ఇప్పుడు పంట కోసం కన్నీరు
అప్పుడు – ఎమ్మెల్యే కండువా కప్పినప్పుడు గోపాల్ “కాంగ్రెస్ వస్తే కరెంటు వస్తుంది, రైతు రాజ్యం వస్తుంది” అని నమ్మాడు. ఇప్పుడు – కరెంటు లేక తన 2 ఎకరాల వరి పంట కళ్ల ముందే ఎండిపోతుంటే చూస్తూ నిస్సహాయంగా నిలబడ్డాడు. “రోజుకు 24 గంటలు కరెంటు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు రోజుకు 5-6 గంటలు కూడా రావడం లేదు. వచ్చినా సరిగ్గా వోల్టేజ్ లేదు, మోటార్లు కాలిపోతున్నాయి. నా పొలానికి నీళ్లు పెట్టలేక వరి ఎండిపోయింది. రూ.40 వేలు పెట్టుబడి పెట్టా, అంతా నష్టమే” అంటూ ఆవేదనతో తన గోడు వెళ్ళబోసుకుంటున్నడు.
సోషల్ మీడియాలో వైరల్.. అధికారుల స్పందనపై ఎదురుచూపులు
గోపాల్ ఆవేదనకు సంబంధించిన వీడియో వాట్సాప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోపై పలువురు స్పందిస్తూ, ఒకప్పుడు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తే ఇప్పుడు విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే సామాన్య రైతుల పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఉండేదని, ప్రస్తుతం కరెంటు కోతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు విమర్శిస్తున్నారు.
మరోవైపు, గోపాల్ వ్యక్తం చేసిన సమస్యలపై విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి, పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

