సాగునీరు అందించడమే లక్ష్యం

- కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
- బాచారం హైలెవల్ కెనాల్
- సర్వే పనులకు భూమిపూజ
పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 28: నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల రైతుల పంట పొలాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం బాచారం హైలెవల్ కెనాల్ పనులకు టీఆర్ఎస్ జిల్లా నాయకులు జగదీశ్వర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. రూ.46 లక్షలతో ఈ కెనాల్ పనులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వే పనులను స్వ యంగా దగ్గరుండి ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాచారం హైలెల్ కెనాల్ పనులు పూర్తయితే మండలంలోని పెద్దకొత్తపల్లి, యాపట్ల, జగన్నాథపురం, మారెడుమాన్‌దిన్నె, చంద్రబండతండా తదితర గ్రామాల్లోని రైతులకు చెందిన 10వేల ఎకరాలకు సాగునీరు అందనున్నదని చెప్పారు. పంట పొలాలకు శాశ్వత సాగునీటి సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే నెలలో పూర్తిస్థాయి డీపీఆర్ తయారు చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అడిగిన వెంటనే బాచారం కెనాల్ హైలెవల్ కెనాల్ కోసం పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌కు కొల్లాపూర్ ప్రాంత రైతాంగం తరఫున ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ విజయభాస్కర్‌రెడ్డి, ఈఈలు శ్రీనివాస్‌రెడ్డి, సంజీవ్‌రావు, డీఈఈ అమర్‌సింగ్, ఏఈ బాల్‌రాం, టీఆర్ఎస్ నాయకులు గణేశ్‌రావు, చంద్రయ్య, మోహన్‌రెడ్డి, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

