తిమ్మాజిపేట, జూన్ 28 : తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి మరికల్ గ్రామానికి చెందిన స్వరూప, శేఖర్ రెడ్డి దంపతులు రూ.40 వేల విలువైన వెండి శంకువులను శనివారం అందజేశారు. అర్చకుడు గంగాధర శర్మ, కమిటీ కార్యదర్శి రామచంద్రారెడ్డికి వీటిని అందించారు. స్వామివారికి నిర్వహించే అభిషేకానికి వీటిని వినియోగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ దాతలను సన్మానించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి, రంగారెడ్డి పాల్గొన్నారు.