Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
Farmers Protest | గత 3 రోజులుగా రైతుల పంట పొలాలకు సక్రమంగా కరెంటు రావడం లేదని మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మహదేవుని పేట గ్రామంలో గల ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు.
Farmers Protest | Nagarkurnool , అక్టోబర్ 13: కాంగ్రెస్ సర్కార్ పాలనలో అన్నదాతలకు ఓ వైపు సాగునీరు లేక, మరోవైపు కరెంట్ కోతలతో నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు.. కరెంట్ కోతలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్లను ముట్టడిస్తూ రేవంత్సర్కార్ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు.
గత 3 రోజులుగా రైతుల పంట పొలాలకు సక్రమంగా కరెంటు రావడం లేదని మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మహదేవుని పేట గ్రామంలో గల ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ఖరీఫ్ సీజన్లో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా మొక్కజొన్న, పత్తి, వరి మినుము తదితర పంటలను సాగు చేయడం జరిగిందన్నారు.
పంటలు చేతికి వచ్చే దశలో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన కొద్దిపాటి గంటల కరెంటు కూడా లో వోల్టేజ్ తో రావడం జరుగుతుందన్నారు. దీంతో పంటలకు సరైన నీరు అందడం లేదని ఆందోళన చేశారు. కరెంటు విషయంలో స్థానిక విద్యుత్ సిబ్బందికి విన్నవించిన పట్టించుకోవడంలేదని అన్నారు. తాము సాగు చేసిన పంటను కాపాడుకోవాలని ఉద్దేశంతోనే ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చ చెప్పడంతో రైతుల ఆందోళన విరమించారు.
Read Also :
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

