తిమ్మాజీపేట : కశ్మీర్లోని పహల్గామ్ ( Pahalgaon) లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ తిమ్మాజిపేట మండల కేంద్రంలో ముస్లింలు ర్యాలీ (Muslims Rally ) నిర్వహించారు. శుక్రవారం ప్రార్థన అనంతరం, జాతీయ జెండాలను( National Flag) పట్టుకుని గ్రామ వీధుల గుండా తిరిగారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిదానాలు చేస్తూ హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పహల్గామ్ మృతులకు అంబేద్కర్ చౌరస్తా వద్ద నివాళులర్పించారు.
మతంపై ద్వేషం నింపుకొని దాడులు చేయడం దారుణం అన్నారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని, ఈ దాడులను బాధ్యులైన తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్లో ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, ముస్లిం మత పెద్దలు, యువకులు పాల్గొన్నారు.