పెబ్బేరు, మే 16 : వ్యవసాయానికి కరెంట్, నీళ్లు ఇవ్వకుం డా అన్నదాతను ఏడిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పం డించిన వడ్లు కొనకుండా గోస పెడుతున్నదని పెబ్బేరు మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్‌చైర్మన్ కర్రెస్వామి ఆరోపించా రు. గురువారం పెబ్బేరులో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దిలీప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు నిరసన చేపట్టా రు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం మాట మార్చిందని, ధాన్యాన్ని కూడా కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు జగన్నాథంనాయుడు, వనం రాములు, విశ్వరూపం, మేకల ఎల్లయ్య, వేణుగోపాల్, సాయిరెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.