బిజినేపల్లి, మార్చి 17: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసి స్తూ ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నా యకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులేందర్‌రెడ్డి మాట్లాడు తూ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ సరికాదన్నారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి కలిసి ఎన్నికల డ్రామాలాడుతున్నారన్నారు. ఆమెను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీ పీ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు మహేశ్వర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రఘుబాబు, తిరుపతయ్య, ఎంపీటీసీ బాలస్వామి, జహంగీర్ ఉన్నారు.
అచ్చంపేట, మార్చి 17: రాజకీయ కుట్రలో భా గంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నాయకులు శంకర్‌మాదిగ, జైపాల్‌నాయక్ ఆదివా రం ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీని అడ్డంపెట్టుకొని ఇతర పార్టీలను బెదిరించేందుకు ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతోందన్నారు. అరెస్ట్‌లు బీఆర్ఎస్కు కొత్తకాదని, ఉ ద్యమంలో ఇలాంటి కుట్రలను ఛేదించుకొని రాష్ర్టా న్ని సాధించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర పన్ని ఎమ్మె ల్సీ కవితను అరెస్ట్ చేశారన్నారు.