
మరికల్, డిసెంబర్ 7 : మండలంలో ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, మండల సమావేశాలకు అధికారులు తూతూ మంత్రంగా నివేదికలు ఇవ్వడమేమిటని, అధికారులు ప్రజా ప్రతినిధులు సహకరించుకొని గ్రా మాలను అభివృద్ధి చేయాలని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీకళారెడ్డి అధ్య క్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వ హించారు. సర్పంచులు, ఎంపీటీసీలు తమతమ సమస్యల ను సభ దృష్టికి తీసుకొచ్చారు. వైద్య శాఖ ప్రస్తుతం ఒమిక్రా న్ వేరియంట్‌పై తగిన జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామా ల్లో సర్పంచులు, కార్యదర్శులు దండోరా వేయించి ప్రతిఒక్కరూ మాస్కులు విధిగా ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే రూ.వెయ్యి జరిమానా విధించాలన్నారు.
మండల సమావేశానికి అధికారులు తగిన సమాచారం లేకుండా రావడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. త మ శాఖ పరిధిలో నిర్వహించిన అభివృద్ధి పనులపై ఎందు కు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమవుతుందని, క్షేత్రస్థాయిలో నిర్వహించ డం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో పంచాయతీల కు ట్రాక్టర్లు ఇచ్చిన చెత్త సేకరించడంలో నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.
మండలకేంద్రంలో పెద్ద చెరువు వద్ద 2018లో చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ పనులు ఇంకేన్నాళ్ళు చేస్తారని నీటి పారుదల శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. నాలు గేండ్లు గడిచినా ఇంకా పనులు పూర్తికాకపోతే ఎలా అని అ న్నారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయాలని, అలాగే మండలంలోని చెరువులను ఎఫ్టీఎల్ గురించి హద్దులు ఏర్పాటు చే యాలని ఆదేశించారు. పెద్ద చెరువు వద్ద ఆక్రమించుకున్న వారిపై చర్యలు గ్రామ పంచాయతీ తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని, యాసంగిలో వరి వేస్తే కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఇబ్బందులు పడతారన్నారు. ఆరుతడి పంటలు సాగు చే యాలన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌనిసురేఖారెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, తీలేరు సింగల్‌విండో చైర్మన్ రాజేందర్‌గౌడ్, రైతుబంధు సమన్వయ సమితి మం డల కోఆర్డినేటర్ సంపత్‌కుమార్, వివిధ శాఖల అధికారు లు తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మితో ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ
ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ ల క్ష్మి, షాదీముబారక్ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మె ల్యే అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని వైఎస్ ఫంక్షన్ హాల్లో 42 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు, ఆడబిడ్డల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను చేపట్టడం జరిగిందన్నారు. ఆడబిడ్డల ముఖల్లో చి రునవ్వును ఈ ప్రభుత్వం చూస్తుందన్నారు. అలాగే సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
మల్లేశ్ కుటుంబ సభ్యుల పరామర్శ
టీఆర్ఎస్ పార్టీ బీసీ విభాగం మండలాధ్యక్షుడు గాదం మల్లేశ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఇ టీవల మల్లేశ్ తమ్మడు లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకొని ఎమ్మెల్యే మండలంలోని రాకొండలో మల్లేశ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ముకుందప్పకు నివాళి
టీఆర్ఎస్ నాయకుడు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ముకుందప్ప సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకొని మంగళవారం ఆ యన నివాసంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ముకుం దప్ప భౌతిక కాయానికి పూలమాలతో నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.