మక్తల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ( Integrated school ) నిర్మాణం కోసం స్థల పరిశీలన చేపట్టామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ( MLA Vakiti Srihari) అన్నారు. ఆదివారం మక్తల్ బీమా పంప్ హౌస్ స్టేజ్ టు వద్ద స్థలాన్ని మక్తల్ మండలం గొల్లపల్లి కి వెళ్లే రోడ్డులో ఉన్న ప్రభుత్వ భూమిని సైతం పరిశీలించామని తెలిపారు.
త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణం కోసం స్థలాన్ని ఎంపిక చేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ సతీష్ కుమార్, ఇరిగేషన్ ఏఈ నాగ శివ, కాంగ్రెస్ నాయకులు కొల్ల వెంకటేష్, లక్ష్మారెడ్డి, చంద్రకాంత్ గౌడ్, కావాలి ఆంజనేయులు, రవికుమార్, తాయప్ప, గుంతల రవి, తదితరులు ఉన్నారు.