ధన్వాడ, జూలై 18 : మండల కేంద్రంలోని కంచుకోట విధీలో వెలిసిన గజ్జలమ్మ దేవి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద భోనం కుండ, జల్దిబిందెతో డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలో ఊరేగుతూ ఆలయానికి చేరుకొని అమ్మవారికి జల, పంచామృతాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వ హించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఎమ్మెల్యేల ప్రత్యేక పూజలు
నారాయణపేట, మక్తల్ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామోహ్మన్‌రెడ్డి సాయంత్రం గజ్జలమ్మదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సర్పంచ్ అమరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, సత్యనారాయణగౌడ్, సూరిగౌడ్, నారాయణస్వామి మల్లేశ్ గౌడ్ తదితరులు ఎమ్మెల్యేలతో పాటు నాయకులు రాజవర్ధన్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అమరేందర్‌రెడ్డి ఆలయాభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేలను కోరారు. స్పందించిన పేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి మాట్లా డుతూ మార్కెట్ యార్డు కోసం రూ.20 లక్షలు మంజూరు చేయించానని ముందుగా ఆ పనులు పూర్తి చేయండని తర్వాత ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోవర్ధన్‌గౌడ్, పూజారులు వెంకటయ్య, కాశీమన్న, కార్యనిర్వహకులు బాలయ్య, బాలకృష్ణ, నర్సింహులు, చంద్రశేఖర్, రాఘవేందర్ రెడ్డి, నరేందర్ గౌడ్, మల్లేశ్‌గౌడ్, సూరిగౌడ్, పార్టీ నాయకులు వెంక ట్‌రెడ్డి, హన్మిరెడ్డి, తిరుపతయ్య, సచిన్, శివారెడ్డి, యాదేశ్ కుమార్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.