కొల్లాపూర్, మార్చి 1 : కార్యకర్తలకు బీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పట్టణంలోని 6, 7, 9వ వార్డుకు చెందిన 15 మంది యువకులు బుధవారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరం గా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలు, రాష్ర్టాభివృద్ధిని చూసి పలువురు బీఆర్ఎస్లో చేరుతున్నార న్నారు.
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ లో జరిగిన అభివృద్ధి ఇతర రాష్ర్టాలకు ఆదర్శం గా నిలుస్తున్నదన్నారు. కొల్లాపూర్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. బీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ భో జ్యానాయక్, ముక్కిడిగుండం సర్పంచ్ దశరథంనాయక్, 10వ వార్డు బీఆర్ఎస్ ఇన్చార్జి పాషా తదితరులు పాల్గొన్నారు.