మహబూబ్‌నగర్ అర్బన్/పాలమూ రు , డిసెంబర్ 6 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌ డ్ అన్నారు. చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యమన్న మహనీయుడని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఏర్పడిన తె లంగాణ అభివృద్ధి, సంక్షేమంలో నేడు దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నదన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు జైభీమ్ చౌరస్తా లో, బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిలో మంత్రి పాల్గొన్నారు. బీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ త్యాగాలను మన నం చేసుకున్నారు. పాత పాలమూరులో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగా నిలిచారని తెలిపారు. పేదల అభివృద్ధి కోసం అహర్నిశలు తా పత్రయపడ్డారన్నారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణ ఏర్పడిన తర్వాత పేదల సం క్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు స్ప ష్టం చేశారు. అంబేద్కర్ స్మారకంగా తె లంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టినట్లు వివరించారు. సచివాలయం సమీపంలోనే 125 అడుగుల భారీ అం బేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న ట్లు తెలిపారు. దేశ రాజధానిలో ఇంతకంటే భారీ విగ్రహాన్ని కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనాదిగా ఎంతో వెనుకబాటుకు గురైన దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మ న్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంక న్న, వైస్ చైర్మన్ గణేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కౌన్సిలర్లు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.
జిల్లాలో కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి పదెకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భవనాల నిర్మాణానికి బండమీదిపల్లిలో సర్వే నెంబర్ 624, 631లో స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం జీవో ఎంఎస్ నెంబర్ 141ను విడుదల చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం జిల్లా కోర్టు భవన సముదాయాల్లో 16 కోర్టులను నిర్వహిస్తున్నారు. జడ్జీలు, అడ్వకేట్లకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. తక్షణమే ఉత్తర్వులు జారీ చేశారని మంత్రి తెలిపారు. త్వరలోనే కోర్టు భవనాల నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు.