వనపర్తి టౌన్, ఏప్రిల్ 4: కవులు, కళాకారుల ను ఆదరించి, గౌరవించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఉమ్మడిరాష్ట్రంలో కవుల ప్రతిభ నిరాదరణకు గురైందని, బానిసత్వపు దారిద్య్రం నుంచి వారు బయటపడాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో బుచ్చమ్మ, బుచ్చారెడ్డి స్మారక అవార్డు ప్రదానోత్సవానికి ఆయన మంగళవారం రాత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కవులు సమాజ అభ్యున్నతికి భవిష్యత్ మార్గాన్ని చూపుతారని.. హా స్యం, వ్యంగ్యస్ర్తాలతో సమాజాన్ని మేల్కొలుపుతారని పేర్కొన్నారు.
అందుకు హాస్యనటు డు చార్లీచాప్లిన్ నిదర్శనమన్నారు. ప్రతిభ, సా మర్థ్యాలు ఉన్నప్పటికీ కుచించుకొని చూసే భావాజాలం నేడు తెలంగాణలో ఉందని.. ఆ జా డ్యాన్ని రూపుమాపి సమాజాన్ని ఉన్నతంగా చూపే దిశగా తెలంగాణ కవులు, కవయిత్రులు పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో సినీ,గేయ రచయిత చంద్రబోస్‌కు ఆస్కార్ అవార్డు వచ్చినా.. ఎలుగెత్తి సన్మానించుకోలేని స్థితిలో మనమున్నామని గుర్తుచేశారు.
అనంతరం స్మారక అవార్డుకు ఎంపికైన కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, యువకవి ఉప్పరి తిరుమలేశ్, ప్రోత్సాహక బహుమతి అందుకున్న తెలుగు తిరుమలేశ్ను మం త్రి శాలువా, పూలమాల, మెమోంటోలతో స త్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు నారాయణరెడ్డి, సభ అధ్యక్షుడు పలుస రమేశ్‌గౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు నాగన్నయాదవ్, బైరోజు చంద్రశేఖ ర్, డాక్టర్ శ్యాంసుందర్, బీఆర్ఎస్ నాయకు లు ప్రేమ్‌నాథ్‌రెడ్డి, ఉంగ్లం తిరుమల్, కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.