మహబూబ్‌గర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వనపర్తి : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తానని మాట తప్పిన ప్రధాని మోదీ పాలమూరుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిలదీశారు. దేశంలోనే పెద్దదైన ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తావా..? ప్రజాగ్రహానికి గురవుతావా..? అని ప్రశ్నించారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సాయంత్రం పాలిటెక్నిక్ కాలేజ్ మైదానంలో జరిగిన వనపర్తి పదేళ్ల ప్రగతి మహా ప్రస్థానం భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
పాలమూరు మీద ఎందుకంత పగ నీకు మోదీ అన్నారు. జాతీయ హోదా ఇవ్వకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. గ్యారెంటీ లేని కాంగ్రెస్ వారంటీలు ఇస్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ స్కీములు పెడుతుంటే.. కాంగ్రెస్ స్క్యాంలు చేసిందన్నారు. కాంగ్రెస్ అంటే మైగ్రేషన్.. బీఆర్ఎస్ అంటే ఇరిగేషన్ అన్నారు. ఆ పార్టీ ఐసీయూలో ఉన్నదని, హస్తం పార్టీని నమ్ముకుంటే 24 గంటల కరెంట్పోయి.. 3 గంటల విద్యుత్ సరఫరా రావడం ఖాయమన్నారు.
నల్లా నీళ్లు బందయి.. నీళ్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తప్పదని హెచ్చరించారు. అందుకే రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్కు అధికారం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కృష్ణానది నీళ్లు తన్నుకుపోతుంటే నాటి మంత్రి, నేటి మాజీ మంత్రి చిన్నారెడ్డి వ్యాసాలు రాశారని ధ్వజమెత్తారు. ఆ రోడ్డు బాలేదు.. ఈ రోడ్డు బాలేదు.. అది బాలేదు.. అనే చిన్నారెడ్డి 11 సార్లు అధికారం ఇచ్చిన కాంగ్రెస్‌లో ఉండి ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. జిల్లాను దత్తత తీసుకున్నోళ్లు కూడా దగా చేశారు.. గతంలో జిల్లా నుంచి 14 లక్షల మంది వలసపోతుంటే నాడు పాలనలో ఉన్న ఏ ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కృష్ణా, తుంగభద్ర నదులు పక్కనే పారుతున్నా.. సాగునీరు పారించలేకపోయారని విరుచుకుపడ్డారు.
ఆర్డీఎస్ తూములు పగులగొట్టి నీటిని అక్రమంగా తరలించుకుపోయినా ఒక్కరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే హారతులిచ్చి పంపించిన దగుల్బాజీ కాంగ్రెస్ నేతలని మండిపడ్డారు. నాడు మనిషి చనిపోతే స్నానాలు చేయడానికి నీళ్లు లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. రైతులను ఆదుకుని రైతుబంధుతో అండగా నిలిచింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. ఇంటింటికీ నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు.
ఆడపిల్లల పెళ్లికి రూ.లక్షా 116 ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. రైతుబీమా పథకం కింద వనపర్తి జిల్లాలో 1,400 మంది రైతులకు రూ.5 లక్షల సాయం చొప్పున అందించామన్నారు. 11 సార్లు అధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టీ సమస్యల గురించి మాట్లాడడం..హంతకులు సానుభూతి చెప్పినట్లుందనీ విమర్శించారు. వస్తదో .. రాదో.. తెలియని తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర మాది.. పదవుల కోసం కాదు.. ప్రాంతం సమస్యలు తీరాలని కొట్లాడారు నిరంజన్‌రెడ్డి అన్నారు.
వనపర్తిలో లక్షా 25 వేల ఎకరాలకు నీళ్లొచ్చాయంటే అది నిరంజన్‌రెడ్డి ఘనత, సీఎం కేసీఆర్ ఆశీస్సుల వల్లే సాధ్యమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. డిగ్రీ కళాశాల కోసం ధర్నాలు చేసిన స్థితి నుంచి వనపర్తికి మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు వచ్చాయని గర్వంగా గల్లా ఎగరేసి చెప్పొచ్చున్నారు. 180 కోట్లతో నూతన దవాఖాన, వనపర్తిని జిల్లాగా మార్చి నూతన కలెక్టరేట్ నిర్మించారని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలోని పీర్ల గుట్ట వద్ద డబుల్ బెడ్రూం ఇండ్లు బంజారాహిల్స్లా ఉన్నాయని కితాబిచ్చారు. 3,280 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారని మంత్రిని అభినందించారు. ఐటీఐ, కేజీబీవీ, వ్యవసాయ డిగ్రీ కళాశాలల నిర్మాణం.. ఇలా చెప్పుకుంటూపోతే అనేకం ఉన్నాయని అన్నారు.
ఇంటి పెద్దలా నిరంజన్‌రెడ్డి వనపర్తిని అభివృద్ధి చేస్తున్నారని, 65 ఏండ్లలో చేయని పనులను ఐదేళ్లలో చేసి చూయించారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కుడిభుజంగా తెలంగాణ జెండా ఎత్తి గ్రామగ్రామానా తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారని గుర్తు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నారని కొనియాడారు. సిరిసిల్ల, సిద్దిపేట మాదిరిగా అత్యధిక మెజారిటీతో నిరంజన్‌రెడ్డిని మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి వీఎం అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, కార్పొరేషన్ చైర్మన్లు, రజిని సాయిచంద్, ఆంజనేయులుగౌడ్, జెడ్పీ లోకనాథ్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
పాన్‌గల్, సెప్టెంబర్ 29 : వనపర్తి జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు. జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో నిర్మించిన రూ.15.50 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను, తిరుమల కాలనీలో రూ.కోటీ 50 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తి పీర్లగుట్టలో డబుల్బెడ్రూం ఇండ్లు బంజారాహిల్స్‌ను తలపిస్తున్నాయని కితాబిచ్చారు. అలాగే వైకుంఠధామంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీ రాములు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ పాల్గొన్నారు.
వనపర్తి, సెప్టెంబర్ 29 : సిద్ద్దిపేట, సిరిసిల్ల తర్వాతి స్థానంలో అభివృద్ధిలో వనపర్తి ముందున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ జిల్లాకు వచ్చిన సందర్భంగా పట్టణంలో ఎక్కడచూసినా జనసంద్రంగా మారి దసరా ముందుగానే వచ్చినట్లు కన్పిస్తున్నదన్నారు. ఒకసారి గెలిపిస్తేనే ఇంతగా అభివృద్ధి చేశామని, గతంలో 75 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. మంత్రి కేటీఆర్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్‌కు రూ.22కోట్ల నిధులను మంజూరు చేస్తూ నేడు జీవో కాపీని మనకు అందజేశారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో 70వేల ఎకరాలకు సాగునీరందించి 2018లో నామినేషన్ వేశానన్నారు.
నేడు లక్షా 25వేల ఎకరాలకు సాగునీరును తీసువచ్చామన్నారు. నియోజకవర్గంలోని కాశీంనగర్ ప్రాంతానికి సాగునీరందించలేకపోయానని, పాన్‌గల్ సమీపంలోని రామన్నగట్టు ప్రాంతంలో రిజర్వాయర్ సీఎం అనుమతులతో త్వరలోనే మంజూరుకానున్నదన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఐటీహబ్ మంజూరు కావడం హర్షణీయం. అలాగే విద్యారంగంలో అనేక ఉన్నత విద్యాసంస్థలు జి ల్లాకు వచ్చాయని, దీంతో ఈ ప్రాంత విద్యార్థులకు ఉన్న త విద్య మరింత చేరువైందన్నారు. జిల్లా ఒకప్పుడు కరువుకాటకాలతో తాండవించేదని, నేడు ఎక్క డ చూసినా సాగునీరు పారుతుండటంతో పచ్చని పైర్లతో అన్నపూర్ణగా విరాజిల్లుతున్నదన్నారు.
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రం ఏర్పాటయ్యాక కేవలం పదేండ్లలోనే ఎంతో అభివృ ద్ధి చేశామని, మళ్లీ అధికారంలోకి కేసీఆర్ స ర్కారే వస్తుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని సంకిరెడ్డిపల్లి గ్రామంలో రూ.300 కోట్లతో ఏర్పాటు చేసిన ప్రీ యూనిక్ ఆ యిల్ ఫ్యాక్టరీకి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి ని రంజన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్‌తో కలిసి శుక్రవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మా ట్లాడారు. దేశమంతా నివ్వెరపోయేలా రాష్ట్రం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతున్నదని, వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్‌వన్‌గా నిలిచామన్నారు.
వరి ఉత్పత్తిలో దే శానికి దారి చూపినట్లే.. వంట నూనెల దిగుమతి ని తగ్గించేందుకు కూడా దారి చూపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా.. నేడు దాదాపు మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నులకు పెరగడం గమనార్హం అని అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వద్దకు తెలంగాణ నుంచి ఆరుగురు మం త్రులం వెళ్లి ‘తెలంగాణలో అయిదింతలకు పైగా ధాన్యం ఉ త్పత్తి పెరిగింది.. మీరు కొనమంటే ఎట్లా’ అని అడిగామన్నారు. అందుకు ఆయన ‘ఇప్పటికే మా వద్ద చాలా ధాన్యం నిల్వలున్నాయి. మీరు చెప్పేదంత నమ్మశక్యం గా లేదు.. దేశంలో ఏ రాష్ట్రం చేయని పని మీరు ఐదేండ్లల్లో ఎట్లా చేశారు. రుజువేమన్న ఇస్తారా? క్యా చమత్కార్ ఆప్ నే..’ అని అన్నాడన్నారు. అందుకు తాము ‘కావాలంటే విమానం ఖర్చు మేమే పెడతాం.. అక్క డికి వచ్చినాక హెలికాప్టర్ కూడా పెడతాను. ఒకనాడు బీడు భూములు, కరువు కాటకాలతో అల్లాడిన పాలమూరు ఇప్పుడు ఎట్లా మారిందో చూపెడతాం రా’ అని చెప్పామన్నారు. పాలమూరు రైతన్నలు సీఎం కేసీఆర్‌కు ఇచ్చిన ఆశీర్వాదంతో గట్టిగా చెప్పామన్నారు.
దేశంలో రైతుబంధు ఇస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతుబీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామన్నారు. పీఆర్ఎల్ఐతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలం కావడంతోపాటు భవిష్యత్‌లో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ‘ఒకనాడు చెరువు కింద చేను ఉండేదని, ఇప్పుడు చేను కిందకు చెరువు వచ్చిం ది’ అని తాడూరు మండలంలోని ఐ తోలు రైతు, ఎస్వీఎస్ యజమాని కృష్ణారెడ్డి చెప్పారని గుర్తు చేశారు. నాడు మనకు అందకుండా కిందకుపోయిన కృష్ణానీటిని ఒడిసిపట్టి రైతు ల పొలాల కు మళ్లిస్తున్నామన్నా రు. దీంతో వ్యవసాయం పండుగలా మారిందన్నారు.