కండ్ల కలకలం టెన్షన్ వద్దు..
కండ్ల కలక అంటువ్యాధి.. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. కొన్నిరోజుల నుంచి కండ్ల కలక కేసులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కంట్లో నలక పడినప్పుడు కంటి నుంచి నీరు కారడం, కండ్లు ఎర్రబడటం మామూలే.
- ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో మందులు
- రోజురోజుకూ విస్తరిస్తున్న వైరస్
- సొంత వైద్యం జోలికి వెళ్లొద్దు
- భౌతికదూరం శ్రేయస్కరం
కండ్ల కలక అంటువ్యాధి.. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. కొన్నిరోజుల నుంచి కండ్ల కలక కేసులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కంట్లో నలక పడినప్పుడు కంటి నుంచి నీరు కారడం, కండ్లు ఎర్రబడటం మామూలే. అయితే కండ్ల కలక బారినపడినప్పుడు కూడా ఇలాంటి బాధలు కనిపిస్తాయి. కండ్లు ఎర్రగా మారిపోయి నీరుకారుతూ ఉంటాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలుచోట్ల కండ్ల కలక వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యకు చికిత్సా, మార్గాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
– మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 2
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మనిషికి శరీరంలో కండ్లు కూడా ముఖ్యమైనవి. కండ్లు బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. జిల్లాలో గత పది రోజుల నుంచి వర్షాలు కురవడంతో వాతావరణంలో వచ్చిన మార్పులతో కండ్ల కలక వ్యాధి విస్తరిస్తున్నది. చిన్నపిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా కండ్ల కలక సమస్యతో బాధపడుతున్నారు. కండ్ల కలకను పింక్ అంటారు. కండ్ల కలక ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంటుందని, రద్దీ ప్రదేశాల్లో చాలా సులభంగా వ్యాప్తి చెందే అవకాశముంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు పాటించడంతోపాటు కండ్ల కలక సోకితే సమీపంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందాలని సూచిస్తున్నారు.
బ్యాక్టీరియా, వైరస్‌తో వ్యాప్తి ఎక్కువ
కంటి గుడ్డు చుట్టూ ఉండే తెల్లని పొర, కంటి రెప్ప ల వెనుక ఉండే పొరను కంజెటైవా అంటారు. కండ్లు తెరచి ఉండడంతో దుమ్ము, ధూళి, వేడి, చలి, నీళ్లు ఏదైనా ప్రభావం చూపిస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే కండ్ల కలక అంటారు. ఈ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా, వైరస్‌తో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇది చిన్నపాటి ఇన్ఫెక్షన్గా అనిపించినా రోజూవారీ పనులు చేసుకోకుండా, ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేస్తుంది. వానకాలంలో మురికి, కాలుష్యం పెరగడంతో కండ్ల కలక సోకుతుందని వైద్యులు చెబుతున్నారు.

లక్షణాలు
కండ్లు ఎర్రబారడం, దురద, కంట్లోంచి నీరు కారుతుంది.
కంటి రెప్పలు ఉబ్బిపోయి, రాత్రి నిద్రపోయినప్పుడు అతుక్కొనిపోతాయి, ఊసులు వస్తాయి.
సాధారణ కండ్ల కలక వస్తే వారంపాటు ఇబ్బంది పెట్టిన తర్వాత తగ్గిపోతుంది.
వైరస్‌తో కండ్ల కలక వస్తే మూడు వారాల పాటు ఉండొచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కండ్ల కలక వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో సంచరించవద్దని, ప్రయాణ సమయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మురికిగా ఉండే చేతులతో కండ్లను తాకొద్దు. దీంతో వైరస్ కండ్లకు వ్యాపిస్తుంది. పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడైనా చేతులతో తాకితే తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్‌తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
ద్విచక్రవాహనదారులు కండ్లకు సన్ గ్లాసెస్ లేకపోతే సేఫ్టీ గ్లాసెస్‌ను ధరించడం మంచిది. వీటితో గాలిలో ఉండే దుమ్మూ ధూళి నుంచి రక్షణగా ఉండడమే కాకుండా వైరల్ నుంచి కాపాడతాయి.
కండ్ల కలకతో బాధపడే వారికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. వారు వాడిన వస్తువులను తాకొద్దు.
ఇంట్లో ఒకరికి వస్తే చాలు ఒకటి రెండు రోజుల్లో మిగతా వారందరికీ వ్యాపించే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలకు సులభంగా సోకుతుంది.
నివారణ చర్యలు
కండ్ల కలక సోకిన వారికి దురదగా అనిపించిన సమయంలో కండ్లపై రుద్దకూడదు.
తరచూ శుభ్రంగా కండ్లను కడగడంతోపాటు తుడుచుకోవడానికి శుభ్రమైన కాటన్ క్లాత్, టిష్యూ పేపర్ని వాడాలి.
కండ్ల కలక సోకిన వారు ఇంట్లో ప్రత్యేకంగా ఉండాలి. ఇది సోకినవారు ఇంటి బయటికి రాకుండా ఉండడం మంచిది.
కండ్ల కలక వచ్చిన సమయంలో వ్యక్తిగత వస్తువులను మరెవ్వరికీ ఇవ్వొద్దు.
అర్హతగల కంటి వైద్యులను సంప్రదించడంతో వ్యాధి తీవ్రత తగ్గించవచ్చు. కంటి వైద్యుల పర్యవేక్షణలో యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్, లూబ్రికెంట్ ఐడ్రాప్స్ మందులు వాడుకోవాలి. సొంత వైద్యం జోలికి పోవద్దు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

