వెల్దండ : మావోయిస్టులు (Maoists) ఆయుధాలను వదిలి శాంతిని నెలకొల్పాలని ఏబీవీపీ కార్యదర్శి అక్కి వంశీ( Vamsi Goud ) గౌడ్ కోరారు. సోమవారం ఏబీవీపీ కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులు ఆయుధాలను వదిలి జన స్రవంతిలో కలవాలని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో హింస ద్వారా దేనిని సాధించలేరని , ఇప్పటివరకు మావోయిజం పేరుతో నక్సలైట్లు సాధించింది శూన్యమని పేర్కొన్నారు.
మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని పేర్కొన్నారు. కొంత మంది వ్యక్తులు యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చే పేద విద్యార్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి లేనిపోని మాటలు చెబుతూ అడవుల్లోకి వెళ్లేటట్టు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మావోయిజం ఉన్న చోట అభివృద్ది చేపట్టలేని పరిస్థితులు అనేకంగా ఉన్నాయని తెలిపారు.
నక్సలైట్ల ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చినప్పుడే నక్సలైట్లు శాంతి చర్చాల పేరుతో ప్రభుత్వానికి రాయబారాలు పంపిస్తున్నారని ఆరోపించారు. కగార్ ఆపరేషన్ ( Kagar Operations) చేపట్టక ముందు శాంతి చర్చల మాట ఎందుకు మాట్లాడలేకపోయారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటికొండ ప్రశాంత్ , కార్యకర్తలు పాల్గొన్నారు.