మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 6 : ఓ వ్యక్తిని దాయాదులు, వారి అనుచరులు విచక్షణా రహితంగా కొట్టి దారుణంగా హత్య చే సిన ఘటన అడ్డాకుల మండలంలోని కాటవరం గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాలెం కొల్లంపల్లి యాదవ్ (42)కు పద్మ అనే యువతితో వివాహం జరిగింది. వారికి ఒక కు మార్తె, కుమారుడు ఉన్నారు. కొల్లంపల్లియాదవ్ కాటవరం గ్రా మంలోనే నివాసం ఉంటూ వ్యవసాయంతోపాటు గొర్రెలను పెం చుతున్నాడు.అయితే మూడు రోజుల కిందట వేరే విషయంలో దాయాదులతో తగాదా వచ్చి మాటామాటా అనుకున్నట్లు తెలిపారు.
కొల్లంపల్లి విషయం ఏదో తేల్చుకోవాలని దాయాదులు వారికి తెలిసిన బయటి వ్యక్తులు మరికొందరిని కారులో పిలిపించుకున్నారు. మంగళవారం ఉదయం కొలంపల్లి పొలం వద్దకు వెళ్లగా గమనించిన దాయాదులు వారు పిలుపుంచుకున్న వారితో కలిసి వెళ్లారు. వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగానే మూకుమ్మడిగా కొల్లంపల్లిపై దాడి చేశారు. దాడికి తట్టుకోలేక అతను కేకలు వేయగా.. జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి చూసి కాటవరం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి పలాన బావి వద్ద ఎవరో ఓ వ్యక్తిని కొడుతున్నారని సమాచారం ఇచ్చారు.
దీంతో వారంతా గ్రామం నుంచి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కొల్లంపల్లిని తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కొల్లంపల్లిని కుటుంబ సభ్యులు కారులో జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లుగా తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భూత్పూర్ సీఐ రామకృష్ణ తెలిపారు.
కొల్లంపల్లిని హత్య చేసిన విషయం తెలియడంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. దాడి చేసిన వారు వచ్చిన కా రును పోలీసులు తీసుకెళ్లడానికి రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులను అడ్డగించారు. దీంతో కారును సీజ్ చే యాలి, కారును ఇక్కడ ఉంచకూడదని అందరికీ నచ్చజెప్పి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.