వనపర్తి రూరల్, మే 27 :సాగు విధానంలో వ్యవసాయ విప్లవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తిలోని శ్రీనివాస పద్మావతి ఫంక్షన్హాల్లో వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలకు సంబంధించిన వానకాలం-2022 సాగుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, చైర్పర్సన్లు, కలెక్టర్లతో కలిసి మంత్రి హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోతెలంగాణ దేశంలోనే అన్నపూర్ణగా నిలిచిందన్నారు. వ్యవసాయం గొప్ప రంగమని, అందుకే సీఎం కేసీఆర్ ముందు చూపుతో ప్రాజెక్టులు నిర్మించారన్నారు. రాష్ట్రంలో 35 లక్షల మంది రైతుబీమాకు దరఖాస్తులు చేసుకున్నారన్నారు.
రాష్ట్రంలోని రైతులు పాత కాలపు సాగును పక్కనబెట్టి అధునాతన రీతిలో పంటల సాగు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. సాగు విధానంలో నూతన వ్యవసాయ విప్లవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీనివాస పద్మావతి ఫంక్షన్హాల్లో వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలకు సంబంధించిన వానకాలం-2022 సాగుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, చైర్పర్సన్లు, కలెక్టర్లతో కలిసి మంత్రి హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అన్నపూర్ణగా నిలిచిందన్నారు. వ్యవసాయం గొప్ప రంగమని, అందుకే సీఎం కేసీఆర్ ముందు చూపుతో ప్రాజెక్టులు నిర్మించారన్నారు. చెరువులను పునరుద్ధరించి సాగునీరు పుష్కలంగా అందించారన్నారు. రైతుబీమా, రైతుబంధు, నిరంతర విద్యుత్‌తో రైతన్నకు అండగా నిలిచారన్నారు. అందుకే మన వ్యవసాయం ప్రపంచ స్థాయికి చేరిందన్నారు. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి వచ్చేలా పంటల సాగు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలన్నారు. ప్రతి ఎకరాకూ సాగునీరు అందుతుండడంతో నేడు భూముల ధరలు అమాంతం పెరిగాయన్నారు. రాష్ట్రంలోని లక్షల ఎకరాలకూ సాగునీరు అందించే విధంగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్‌పాం సాగుపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వానకాలం సీజన్లో పంటలను జూలై 15 నాటికి వేసుకోవాలని సూచించారు.
రైతబీమాకు 35 లక్షల దరఖాస్తులు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
రాష్ట్రంలో 35లక్షల మంది రైతుబీమాకు దరఖాస్తులు చేసుకున్నారని, ఇప్పటివరకు రూ.80449 మందికి ఈ పథకం కింద బాధిత కుటుంబాలకు బీమా అందజేసినట్లు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. వానకాలంలో ఏ పంటలు సాగు చేయాలి..? ఏ పంటలు వేస్తే మద్దతు ధర వస్తుంది.. అన్న అంశాలపై వనపర్తిలో సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో 60శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. ఐదు ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున ఒక రైతు వేదికను ఏర్పాటు చేశామన్నారు. సమీకృత వ్యవసాయ విధానం అలవర్చుకొని రైతులు వృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు. హార్టికల్చర్ అధికారులు పండ్లతోటల సాగుకు అధిక ప్రాధాన్యతనిచ్చి రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు.
కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు మేలురకమైన వంగడాలు, సాగుపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, సురభి వాణీదేవి, విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషా తదితరులు రైతులు సాగు చేస్తున్న పంట సాగు దిగుబడుల గురించి మాట్లాడారు.
సమావేశంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, చైర్పర్సన్లు సరిత, పద్మావతి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ హనుమంతు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, విషువర్ధన్‌రెడ్డి, ఉద్యానశాఖ అధికారి సురేశ్, వ్యవసాయాధికారి సుధాకర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, హనుమంతురావు, విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ జగదీశ్వర్‌రెడ్డి, మనోహర్, వెంకట్రాం, మార్కెట్ కమిటీ చైర్మన్లు లక్ష్మారెడ్డి, శ్యామల, బాలనారాయణ, ఎస్ఏ రాజు, మధుసూదన్‌రెడ్డి, కురుమయ్య, రామేశ్వరమ్మ, రాందేవ్‌రెడ్డి, మన్యం సుధాకర్, వెంకటేశ్వర్లు, గోవిందు నాయక్, శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, రైతులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.