నాగర్‌కర్నూల్, మే 27: రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. పార్టీలో చేరిన వారు అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నివాసంలో ఎమ్మెల్యే మర్రి సమక్షంలో ఉయ్యాలవాడ గ్రామ 7వ వార్డు కౌన్సిలర్ నాగమ్మ గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతోపాటు పార్టీలోకి వచ్చిన సీనియర్ నాయకులు రవీందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రాములుతోపాటు వంద మంది నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఉయ్యాలవాడ గ్రామ శివారులో మెడికల్ కళాశాలను మంజూరు చేయించి గ్రామాభివృద్ధికి కృషి చేయడంపై వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాల ఏర్పాటుకు సహకరించిన గ్రామస్తులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులే కాదు మెడికల్ కళాశాల తమ గ్రామ సమీపంలో నిర్మించాలని అన్ని పార్టీల నాయకులు కోరారని గుర్తు చేశారు. కళాశాల మంజూరు కావడం, నిర్మాణం పూర్తవుతుండడంతో ఈ ప్రాంతానికి కళ వచ్చిందన్నారు. అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కల్పన, వైస్ చైర్మన్ బాబురావు, టీఆర్ఎస్ నాయకులు భాస్కర్‌గౌడ్, కౌన్సిలర్ ఖాజాఖాన్ పాల్గొన్నారు.
అభివృద్ధికి ఆకర్షితలై..నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
నారాయణపేట రూరల్, మే 27 : నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొల్లంపల్లి గ్రామంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. చేరిన వారిలో శ్రీనివాస్‌రెడ్డి, పవన్, రామాంజనేయులు, గొల్ల శ్రీనివాస్, కిష్టప్ప, తులసీనాయక్, సూర్యానాయక్, శ్రీనునాయక్, భీమా నాయక్, రాములుతో పాటు మరో 20 మంది గులాబీ పార్టీలో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయిరెడ్డి, మండల అధ్యక్షుడు వేపూరి రాములు, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ వడెప్ప, జెడ్పీకోఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్ పాల్గొన్నారు.