నవాబ్‌పేట, మే 27 : నవాబ్‌పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం అంకితభావంతో పనిచేసి రైతులకు సేవలు అందించాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూ చించారు. శుక్రవారం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమై నూత న పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ తేదీని ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అన్నదాతలకు అనేక సంక్షేమ పథకాలను అందజేస్తూ అక్కున చేర్చుకుంటున్నదని తెలిపారు. గ్రామాల్లో రైతులకు ఏ కష్టం రాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలని కోరా రు. మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం చేసేందుకు జూన్ 6వ తేదీని ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అనంతరం నూతన చైర్మన్ మెండె లక్ష్మయ్య, వైస్‌చైర్మన్ చందర్‌నాయక్‌ను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేకంగా అభినందించి శాలువాతో సన్మానించారు.
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని లోకిరేవులో నిర్వహించిన బొడ్రాయి, కోటమైసమ్మ, విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ భక్తిభావం అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్రం ఏర్పాటయ్యాకే ఆలయాలు పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయని చెప్పారు.
అనంతరం గ్రామస్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎంపీపీ కిషన్‌జీని ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సిం గిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, సర్పంచులు గోపాల్‌గౌడ్, కావలి సత్యం, లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ రాధాకృష్ణ, నాయకులు నాగిరెడ్డి, పాశం గోపాల్, వెంకటేశ్, కృష్ణ య్య, సంజీవరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు నర్సింహులు, గోపాల్‌గౌడ్, యాదయ్య, నాగిరెడ్డి, నర్సింహాచారి, శ్రీను, రవి, రాజేందర్, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.