భూత్పూర్, మే 27 : రాష్ట్ర ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పని చేస్తున్నదని ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలోని సిద్దాయపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ జూన్ 4న లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో రూ.117కోట్లతో అభివృద్ధి పనులను, పేరూర్ లిఫ్ట్‌ను, భూత్పూర్ నుంచి వెల్కిచర్ల రోడ్డు, మున్సిపాలిటీలోని ప్రతి తండాకు బీటీ రోడ్లను మంత్రి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భూత్పూర్లో ఏర్పాటు చేసి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నియోజవర్గంలో 18గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు తెలిపారు.
సిద్దాయపల్లిలో ముందుగా భూత్పూర్-మహబూబ్‌నగర్ రోడ్డు విస్తరణలో ఇండ్లను కోల్పోయిన 42మందికి కూడా ఇండ్లను కేటాస్తున్నట్లు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇచ్చినందునా ఇండ్లను ముందుగా వారికి కేటాస్తున్నట్లు గుర్తుచేశారు. అనంతరం లబ్ధిదారులతో లక్కీడిప్‌ను తీయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేస్తే ఉమ్మడి జిల్లాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు వేసి అడ్డుకోవడం దారుణమని ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, తాసిల్దార్ చెన్నకిష్టన్న, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, నాయబ్ తాసిల్దార్ రాజీవ్‌రెడ్డి, ముడా డైరెక్టర్లు సాయిలు, చంద్రశేఖర్‌గౌడ్, కౌన్సిలర్లు బాలకోటీ, శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, కో ఆప్షన్లు అజీజ్, జాకీర్, నాయకులు మనెమోని సత్యనారాయణ, గోప్లాపూర్ సత్యనారాయణ, బాలస్వామి, కురుమయ్య పాల్గొన్నారు.