నారాయణపేట టౌన్, మే 27 : 15వ ఆర్థిక సంఘం నుంచి వైద్య రంగానికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. పట్టణంలోని జెడ్పీ కార్యాలయంలో 2020-21, 2021-22 ఏడాదికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి నిర్వహించే పనులపై శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా లో వైద్య రంగానికి రూ.66లక్షల41వేలు కేటాయించామని పేర్కొన్నారు. నిధులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రణాళికతో ముందుకు సాగాలి
జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న 5వ విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు ప్ర ణాళికతో ముందుకు వెళ్లాలని జెడ్పీ చై ర్పర్సన్ అన్నారు. జెడ్పీ కార్యాలయం లో జిల్లాలోని వివిధ మండలాల ఎం పీడీవోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ న్యాయకత్వంలో పల్లెలు, పట్టణా లు అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. భవిష్యత్తు తరాలు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ప్ర భుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లా లో క్రీడా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో క్రీడల నిర్వహణకు కమిటీలు పని చేయాలన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన గ్రా మాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలన్నారు. సమావేశాల్లో జెడ్పీ సీఈవో సిద్ధి రామప్ప, డిప్యూటీ సీఈవో జ్యో తి, డీఎంహెచ్వో రామ్మనోహర్రావు పాల్గొన్నారు.