ఊట్కూర్, మే 27 : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రో ల్, డీజిల్, వంట నూనెల ధరల ను తగ్గించాలని సీపీఐ (ఎంఎల్ ప్రజాపంథా) డివిజన్ నాయకు డు చెన్నప్ప, ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కనకరాయు డు కోరారు. వామపక్ష పార్టీల పి లుపుమేరకు కేంద్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా స్థానిక అంబేద్కర్ కూడలిలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర లు రెండు నెలల్లో విపరీతంగా పెంచడంతో ఇతర వస్తువులపై పెను భారం పడి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్య క్తం చేశారు.
ఎన్నికలకు ముందు అచ్చే దిన్ ఆయే గా అని చెప్పిన మోడీ ప్రభుత్వం ప్రజలకు సచ్చే దిన్ తెచ్చినారని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యో గ, ఉపాధి అవకాశాలు దక్కడం లేదని, అసంఘటిత రంగ కార్మికులు, ఉపాధి కూలీలకు సరైన వే తనాలు లభించడం లేదన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, రూ.75 00 జీవన భృతి చెల్లించాలన్నారు. పెంచిన దరల ను తగ్గించే వరకు కేంద్రంపై పోరాటం చేస్తామన్నా రు. ఈనెల 30న కలెక్టరేట్ ముట్టడి, 31న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు సిద్ధు, రా ము, నర్సింహ, అంజి, కృష్ణయ్య, తమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో…
నారాయణపేట టౌన్, మే 27 : పెట్రోల్, డీజి ల్, వంటగ్యాస్, వంట నూనెలు తదితర నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌రాం, ప్రగతిశీల మ హిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జయ కోరారు. పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన నిర సన కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న నాటి నుంచి ధరలు విపరీతంగా పెంచుతూ సా మాన్యులు మోయలేని భారాలు వేస్తున్నారన్నా రు. ధరలు అదుపులో ఉంచాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి 14 రకాల నిత్యావసర ధరలు అందించాలని కోరారు. అనంతరం తాసిల్దార్ దా నయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్ ప్రజాపంథా) మండల కా ర్యదర్శి నర్సింహ, ప్రశాం త్, హాజిమల్లాంగ్, సీపీ ఎం నాయకులు, అరుణోదయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.