దేవరకద్ర రూరల్, మే 25 : మండలంలోని చౌదర్పల్లి, గద్దెగూడెం గ్రామాల్లో బుధవారం బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. చౌదర్పల్లిలో మూడురోజులపాటు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బొడ్రాయిని ప్రతిష్ఠించారు. గ్రామస్తులు కుటుంబసమేతంగా గ్రామదేవతను దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. గద్దెగూడెంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఉత్సవాలకు దేవరకద్ర ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరై పూజలు చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
భూత్పూర్, మే 25 : మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ సాక్షిగణపతి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నిజామాబాద్ వీర్యమఠ్ పీఠాధిపతి 1008 శివానందాచార్య ముఖ్యఅతిథు లుగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గణపతిహోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రభులింగం, రవిశంకర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.